హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): వరంగల్‌లో న్యాయవాది మల్లారెడ్డిని హత్య చేసిన నిందితులను చట్ట ప్రకారం శిక్షించాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నర్సింహారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కిరాతక హత్యను ఖండిస్తున్నట్లు తెలిపారు. న్యాయవాదులపై దాడుల నివారణకు ప్రత్యే క చట్టాన్ని రూపొందించాలని కోరారు. ఇదిలా ఉండగా, మల్లారెడ్డి హత్యను ఖండిస్తూ హైకోర్టులో పలువురు న్యాయవాదులు నిరసన వ్యక్తంచేశారు.
హైకోర్టు న్యాయవాదుల సం ఘం అధ్యక్షుడు రఘునాథ్, కార్యదర్శులు గడిపల్లి మల్లారెడ్డి, జల్లి నరేందర్ ఇతర న్యాయవాదులు హైకోర్టు గేటు వద్ద ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌కు వినతిపత్రం సమర్పించారు.