హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు ఏడేండ్ల తర్వాత వచ్చే జనవరి 30న ఎన్నికలు జరుగనున్నాయి. కౌన్సిల్ కార్యదర్శి గురువారం షెడ్యూల్ విడుదల చేశారు.
పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీపడే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. 25 మందిని ప్రాధాన్యత ఓటుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు ఎన్నుకోనున్నారు. ఈ పాతికమంది సభ్యులు, కౌన్సిల్ చైర్మన్, వైస్‌చైర్మన్‌తోపాటు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిని ఎన్నుకుంటారు.