హైదరాబాద్ : బన్సీలాల్ పేట మెట్ల బావిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్ పేటలోని పురాతన మెట్ల బావి వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్తో కలిసి మంత్రి తలసాని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమృత్సర్లోని గురుద్వార్ మెట్ల బావి మాదిరిగా అన్ని విధాలుగా అభివృద్ధి చేసి సుందరంగా తీర్చి దిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పురాతన నిర్మాణాలకు పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తందన్నారు.
బావి పరిసరాలలోని అన్ని గృహాలకు నల్లా కనెక్షన్లు, రహదారుల నిర్మాణం, పర్యాటకులను ఆకర్షించే విధంగా బావి పరిసరాలలో ని అన్ని భవనాలకు ఒకే రకమైన పెయింటింగ్ వేయిస్తామన్నారు.