సంగారెడ్డి : జిల్లా పరిధిలోని నారాయణ్‌ఖేడ్ పట్టణంలో కరోనా కలకలం సృష్టించింది. ఓ జాతీయ బ్యాంకు ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో బుధవారం ఆ బ్యాంకును అధికారులు మూసివేశారు. బ్యాంకు ఉద్యోగికి కరోనా సోకిన కారణంగా బ్యాంకును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు నోటీసు బోర్డులో పేర్కొన్నారు.
సోమవారం, మంగళవారం బ్యాంక్‌కు వచ్చిన వినియోగదారులు తప్పనిసరిగా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని బ్యాంక్ మేనేజ్మెంట్ సూచించారు. వినియోగదారులందరూ కరోనా నివారణ జాగ్రత్తలు పాటించాలని కోరారు.
కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. వైద్యారోగ్య శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, కరోనాను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైతేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.