జగిత్యాల : భారతీయ సంప్రదాయంలో గాజులకు(Bangles) ప్రత్యేక స్థానముంది. మహిళలు గాజులు ధరించడం ఐదో తనానికి ప్రతీకగా భావిస్తారు. గాజుల పండుగ అంటే తమ స్నేహితులు ఒకచోట చేరి గాజులు వేసి తమలోని ప్రేమను వ్యక్తపరచడం అలాంటి కార్యక్రమం ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నాం. ఒకరిద్దరు లేదా పది మంది స్నేహితులు కలిసి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. కానీ, ఆ గ్రామంలో మాత్రం మహిళలు అంతా కలిసి ఒకే చోట చేరి గాజుల పండుగను ఘనంగా నిర్వహించారు.
గ్రామంలోని ఉన్న వృద్ధులు, మహిళలు, యువతులు దాదాపుగా 500 మంది ఒక్కదగ్గర చేరి ఉత్సాహంగా గాజులు పండుగా జరుపుకున్నారు. ఈ అపురూప ఘట్టానికి జగిత్యాల జిల్లా భీమారం మండలం రాగాఓజీ పేట గ్రామం వేదికైంది. గ్రామస్తులు ముందుగా మెహందీ కార్యక్రమం అనంతరం పసుపు, కుంకుమ కార్యక్రమం ఆ తర్వాత గాజుల పండుగ నిర్వహించి స్వీట్లు పంపింణీ చేశారు. అనంతరం దాండియా ఆటలాడుతూ ఆట పాటలతో ఆహ్లాదంగా గడిపారు. ఈ కార్యక్రమం మాజీ సర్పంచ్ బాలసాని లహరిక ఆధ్వర్యంలో నిర్వంచారు.
Ban