హైదరాబాద్, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ): తెలంగాణకు చెందిన 13 రిజిస్ట్రర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలను రాజకీయ పార్టీల జాబితా నుంచి తొలగిస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య సమితి, బహుజన్ సమాజ్ (అంబేద్కర్-ఫూలే), ఇండియన్ మైనార్టీస్ పొలిటికల్, జాగో, జాటియా మహిళా, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్, తెలంగాణ కార్మిక రైతురాజ్యం, తెలంగాణ లోక్సత్తా , తెలంగాణ మైనార్టీస్ ఓబీసీ రాజ్యం, తెలంగాణ ప్రజాసమితి (కిశోర్, రావ్ అండ్ కిషన్), తెలంగాణ స్టూడెంట్స్ యునైటెడ్ ఫర్ నేషన్, యువ, యువతెలంగాణ తదితర పార్టీలున్నాయి. 2019 నుంచి ఆరేండ్లలో ఒక్క ఎన్నికల్లోనైనా పోటీ చేయాలనే షరతును నెరవేర్చడంలో విఫలమైన ఆర్యూపీపీలను పార్టీల జాబితా నుంచి తొలగించడానికి నిర్ణయం తీసుకుంటున్నట్టు ఎన్నికల కమిషన్ వెల్లడించింది.