Balka Suman | దళిత సమాజానికి సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలి : బాల్క సుమన్
Balka Suman | కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆరోపించారు. సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద ఎలాంటి అలంకరణలు చేయలేదని.. పూలమాల వేయలేదన్నారు.
Balka Suman | కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆరోపించారు. సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద ఎలాంటి అలంకరణలు చేయలేదని.. పూలమాల వేయలేదన్నారు. సీఎం రేవంత్‌కు అహంకారం ఎందుకని ఆయన ప్రశ్నించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కేసీఆర్ పెట్టారనే అక్కడ ఏర్పాట్లు చేయలేదా? రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ కట్టిన సచివాలయంలో రేవంత్ ఎలా కూర్చుంటున్నడని.. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టారన్నారు. తెలంగాణలో కేసీఆర్ గుర్తులను చెరిపేస్తామని రేవంత్ అన్నారని.. కాళేశ్వరం నీళ్లను రైతులకు అందకుండా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. భేషరతుగా రేవంత్ దళిత సమాజానికి క్షమాపణలు చెప్పాలన్నారు. సీఎం ఫ్యూడల్‌మైండ్ సెట్‌తో ఉన్నారని.. డిప్యూటీ సీఎం భట్టి ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ప్రశ్నించారు.
భట్టికి చిన్నపీట వేసినా మౌనంగా ఉన్నారని.. అంబేద్కర్ రిజర్వేషన్లతోనే భట్టి డిప్యూటీ సీఎంగా అయ్యారన్నారు. దళితుల ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి కించపరిచారన్నారు. రాష్ట్రంలో దళిత సంఘాలు, మేధావులు స్పందించాలన్నారు. గతంలో అనేక విషయాలపై స్పందించిన లౌకికవాదులు, మేధావులు నోరు విప్పాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకుందని.. నయా దేశ్ముఖ్లాగా రేవంత్ వ్యవహరిస్తున్నారన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద కనీసం పరిసరాలను శుభ్రం చేయలేదన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

