నాంపల్లి క్రిమినల్ కోర్టులు,మార్చి 17 (నమస్తే తెలంగాణ): యూట్యూబ్ చానల్ పల్స్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ పీ రేవతి, రిపోర్టర్ బండి సంధ్య అలియాస్ తన్వీ యాదవ్‌కు 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జీ అనూష షరతులతో కూడిన బెయిల్ మూం జూరు చేశారు. ఇద్దరినీ ఐదురోజుల కస్టడీకి అప్పగించాలన్న సైబర్ క్రైమ్ అధికారుల పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఓ రైతు చేసిన వ్యాఖ్యలను ప్రసారం చేసినందు కు పోలీసులు వీరిని అరెస్టు చేసిన సం గతి తెలిసిందే. ఈ కేసులో వారిపై ఆర్గనైజెషన్ సెక్షన్ 111ను చేర్చినా కోర్టు పరిగణించ లేదు. పోలీసు కస్టడీ పిటిషన్‌ను డిస్మిస్ చేయడంతో న్యాయం గెలిచిందని న్యాయవాదులు లక్ష్మణ్, లలితారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. రూ.25 వేల చొప్పున ఇద్దరి జమానత్‌లను కోర్టు కు సమర్పించాలని, పాస్‌పోర్టులను స్వా ధీనం చేయాలని కోర్టు బెయిల్ ఉత్తర్వు ల్లో ఆదేశించింది. తన్వీ యాదవ్‌కు పాస్‌పోర్ట్ లేకపోవడంతో ఆమె తరఫున న్యా యవాదులు జక్కుల లక్ష్మణ్, లలితారెడ్డి అఫిడవిట్‌ను దాఖలు చేయనున్నారు. జైలు అధికారులకు కోర్టు ఉత్తర్వులు అందిన వెంటనే మంగళవారం సాయం త్రం విడుదల చేయనున్నారు. సైబర్ క్రైమ్ ఎస్‌హెచ్‌వో, విచారణాధికారి ఎస్ నరేశ్ కోర్టు జారీ చేసిన షోకాజ్ నోటీసులకు వివరణ సమర్పించారు. సెక్షన్ 111 వర్తింపు గురించి, మహిళా జర్నలిస్టుల అరెస్టు సమాచారాన్ని ఎవరికి అం దించారో సమయంతో సహా తెలియజేయాలని ఆదేశించడంతో అందుకు బదులిచ్చారు.