హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): బీసీ గురుకులాల్లో 6,7,8,9 తరగతులు కలిపి 6,832 బ్యాగ్ లాగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను గురువారం విడుదల చేశారు. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి సైదులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రవేశపరీక్షలో మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించినట్టు వెల్లడించారు. ఫలితాలను www.mjptbcwreis. telangana.gov.in, https://mjptbcadmissions.org వెబ్సైట్లో చూసుకోవాలని తెలిపారు. 24న కౌన్సెలింగ్ ఉంటుందని, ఎంపికైన విద్యార్థులు తమ ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు.