సుల్తాన్‌బజార్, అక్టోబర్ 21 : బ్యాక్లాగ్ పోస్టులను జనరల్ క్యాటగిరీలోకి మార్చి తమకు న్యాయం చేయాలని డీఎస్సీ ఉర్దూ మీడియం అభ్యర్థులు డిమాండ్ చేశారు. సోమవారం గాంధీభవన్ వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. డీఎస్సీ-2024 1,183 ఉర్దూ మీడియం పోస్టులు ఉన్నాయని, కానీ సీఎం ఇచ్చిన అపాయింట్మెంట్లలో 550 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తంచేశారు.
మిగతా పోస్టులు బ్యాక్లాగ్ అయ్యే అవకాశం ఉందని, దీంతో తమకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టిసారించి బ్యాక్లాగ్ పోస్టులను జనరల్ క్యాటగిరీలోకి మార్చి తమకు న్యాయం చేయాలని కోరారు.