Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బ్యాచ్లర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సు పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు మూడు, అయిదో సెమిస్టర్ బ్యాక్లాగ్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షా ఫీజును ఈ నెల ఈ నెల 17వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. ఈ కోర్సు మొదటి సెమిస్టర్ మెయిన్ పరీక్షా ఫీజును ఈ నెల 25వ తేదీ వరకు సంబంధిత కళాశాలల్లో చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను ఈ నెలలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
ఇవి కూడా చదవండి..
Osmania University | ఓయూ పరిధిలో వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
TGPSC | మే 1 తర్వాతే కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు : టీజీపీఎస్సీ
Group-3 | గ్రూప్-3 ప్రాథమిక కీ విడుదల చేసిన టీజీపీఎస్సీ