హైదరాబాద్: 9 ఏండ్ల బాలుడిని లైంగికంగా వేధించిన ఆయాకు 20 ఏండ్ల జైలు శిక్ష పడింది. దీంతో పాటు రూ.10 వేల జరిమానాను బాలమిత్ర కోర్టు విధించింది. వివరాల్లోకి వెళితే.. పాతబస్తీలో ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న 9 ఏండ్ల బాలుడిని లైంగిక వేధింపులకు గురిచేసిన పాతికేండ్ల ఆయాపై 2017 డిసెంబర్లో చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన చాంద్రాయణగుట్ట పోలీసులు కోర్టులో సాక్ష్యాధారాలు సమర్పించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన అనంతరం బాలమిత్ర కోర్టు ఆయాకు 20 ఏండ్ల జైలుశిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధించింది.