ముప్కాల్, జూలై 1: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను సోమవారం ఎత్తారు. జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు గేట్లు తెరిచి ఉంచాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు గేట్లను పైకి ఎత్తారు. తెలంగాణ, మహారాష్ట్రతోపాటు సీడబ్ల్యూసీ ప్రతినిధుల సమక్షంలో 14 గేట్లను తెరిచారు. బాబ్లీలో ఉన్న 0.2 టీఎంసీల నీరు దిగువకు వస్తున్నదని ఎస్సారెస్పీ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌గుప్తా తెలిపారు. ఎస్సారెస్పీ ఎస్ఈ శ్రీనివాస్ గుప్తా, సీడబ్ల్యూసీ ఈఈ వెంకటేశ్వర్లు, నాందేడ్ ఈఈ చక్రపాణి, ఏఈఈ బన్సద్, ఏఈఈ వంశీ, సతీశ్ పాల్గొన్నారు.