BA One Time Chance Exams | ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఏ వన్‌టైం చాన్స్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ (ఇయర్ వైస్ స్కీమ్) వన్‌టైం చాన్స్ పరీక్షలను వచ్చే నెల 7వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.