హైదరాబాద్, డిసెంబర్ 12(నమస్తే తెలంగాణ) : కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని ఉద్యాన కళాశాలల్లో బీఎస్సీ డిగ్రీ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఏ భగవాన్ తెలిపారు. 2025-26 సంవత్సరానికి బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్ డిగ్రీలో ప్రవేశాలకు ఈ నెల 17న ఉదయం 10.30 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు చెప్పారు.
బైపీసీతో ‘ఎప్సెట్-2025’కు అర్హులై, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కంబైన్డ్ కౌన్సెలింగ్కు దరఖాస్తులు సమర్పించి, ర్యాంకు పొందిన విద్యార్థులు ఈ కౌన్సెలింగ్కు హాజరుకావచ్చని పేర్కొన్నారు. www.skltghu.ac.in, www.pjtau.edu.inలలో, సంప్రదించవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.