హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా కడ్తాల్‌లోని అయ్యప్ప మాలధారులు మొక్కలు నాటారు. శనివారం మైసిగిండి శివాలయం, రామాలయం ఆవరణలో మొక్కలను నాటారు. స్పందించిన మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ అభినందనలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో స్వాముల భాగస్వామ్యం అభినందనీయమని ప్రశంసించారు. ఆరోగ్యకరమైన భవిష్యత్ కోసం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సిహరెడ్డి, ఆనంద్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.