తొర్రూరు : అయ్యప్ప మాలలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌కు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ డిపో ఎదుట గురువారం అయ్యప్ప భక్తులు ధర్నా చేశారు. డిపో మేనేజర్ పద్మావతీరెడ్డి అయ్యప్ప స్వామి భక్తులకు క్షమాపణ కోరారు. ఎస్ఐ ఉపేందర్ చేరుకుని భక్తులకు సర్దిచెప్పి సద్దుమణిగేలా చేశారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని శ్రీ వేంకటేశ్వర మణికంఠ ఆలయంలో అయ్యప్ప మాలధారులకు ముస్లింలు భిక్ష ఏర్పాటు చేసి మతసామరస్యాన్ని చాటారు. కరీంనగర్‌లోని ధరూల్ ఖైల్ సొసైటీ సభ్యులు.. సుమారు 150 మంది అయ్యప్ప మాలధారులకు గురువారం భిక్ష ఏర్పాటు చేశారు. ఆరేళ్లుగా నిర్వహిస్తున్నట్టు సభ్యులు తెలిపారు.
– చొప్పదండి