IndiGo | శంషాబాద్లో అయ్యప్ప భక్తుల ఆందోళన.. ఉద్రిక్తత
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) విమానాల రద్దు పరంపర కొనసాగుతున్నది. సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యలతో వరుసగా మూడో రోజూ పెద్ద సంఖ్యలో సర్వీసులు (IndiGo Airlines) నిలిచిపోయాయి. శుక్రవారం మొత్తం 500కుపైగా విమానాలను సంస్థ రద్దు చేసింది.
హైదరాబాద్: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) విమానాల రద్దు పరంపర కొనసాగుతున్నది. సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యలతో వరుసగా మూడో రోజూ పెద్ద సంఖ్యలో సర్వీసులు (IndiGo Airlines) నిలిచిపోయాయి. శుక్రవారం మొత్తం 500కుపైగా విమానాలను సంస్థ రద్దు చేసింది. దీంతో ఎయిర్పోర్టుల్లో ఇండిగో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బోర్డింగ్ ప్రక్రియ ముగిసి 12 గంటలవుతున్నా తాము వెళ్లాల్సిన విమానానికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళలనకు దిగుతున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో అయ్యప్ప స్వాముల నిరసనతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సిన విమానం 12 గంటల పాటు ఆలస్యం కావడంతో అయ్యప్పలు ఆందోళనకు దిగారు.
ఇండిగో విమానం గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సి ఉంది. ఈ విమానంలో వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు సాయంత్రమే శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే, విమానం శుక్రవారం ఉదయానికి కూడా బయలుదేరకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. బోర్డింగ్ గేటుకు అడ్డంగా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 12 గంటలుగా తాము విమానాశ్రయంలోనే ఉన్నామని, విమానం గురించి తమకు సమాచారం ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయలేదని ఆసహనం వ్యక్తం చేశారు. కాగా, ఇండిగో విమానాల రద్దు కారణంగా ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు, మూడు రోజులుగా విమానా సర్వీసులు లేకపోవడంతో ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

