ఖైరతాబాద్, అక్టోబర్ 12 : అర్థరైటిస్ ఉంటే ఇక ఇంటికే పరిమితం కావాల్సిన అవసరం లేదని, ప్రతి రోజు కొంత సమయం చేతనైనంత మేరకు నడవాలని వైద్యులు సూచించారు. వరల్డ్ అర్థరైటీస్ డే సందర్భంగా బుధవారం నెక్లెస్‌రోడ్ పీవీ మార్గ్‌లోని పీపుల్స్‌ప్లాజా వద్ద ‘యశోద వాక్’ పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ వాక్‌ను సీనియర్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ సునీల్ దాచేపల్లి, యశోద హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ పవన్, సీఈవో (సోమాజిగూడ) కార్తీ, హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ అధ్యక్షుడు అభిజీత్, కార్యదర్శి ప్రశాంత్ ప్రారంభించారు. ఈ వాక్ పీపుల్స్‌ప్లాజా, జలవిహార్ మీదుగా కొనసాగింది.
డాక్టర్ సునీల్ దాచేపల్లి మాట్లాడుతూ ఆర్థరైటిస్ అనగానే ఇక జీవిత కాలంలో నడవలేరన్న అపోహ ఉన్నదన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా నిత్యం 35 నుంచి 40 నిమిషాల పాటు వాక్ చేయాలని, తద్వారా కీళ్లకు ఆరోగ్యం చేకూరుతుందని దాచేపల్లి తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ జీవన్, డాక్టర్ విష్ణు, యశోద దవాఖాన సీనియర్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, బీఎన్ ముకేష్, ఫణి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.