హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): గ్లోబల్ పద్మశాలి సమ్మిట్‌కు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీ య కార్యవర్గ సభ్యుడు, తెలంగాణ పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అవ్వా రి భాసర్ ప్రత్యేక ప్రతినిధిగా హాజరుకానున్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో దుబాయ్ లో నార్త్ అమెరికన్ పద్మశాలి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలిలు ఎదురొంటున్న రాజకీయ, ఆర్థిక అంశాలపై చర్చించనున్నట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పద్మశాలీలను ఏకతాటిపైకి తీసుకురావడం సదస్సు ముఖ్య ఉద్దేశమని చెప్పారు. చేనేతపై జీఎస్టీ అంశం పై కూడా చర్చించనున్నట్టు వెల్లడించారు.