గురువారం 28 మే 2020
Telangana - May 08, 2020 , 01:14:22

చిన్నోడు.. పెద్ద ఆలోచన

చిన్నోడు.. పెద్ద ఆలోచన

  • ఆటోమేటిక్‌ హ్యాండ్‌వాష్‌ పరికరం తయారీ
  • అభినందించిన నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ 

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: కరోనా నేపథ్యంలో  తరచూ చేతులను శుభ్రం చేసుకోవాల్సిన ప్రస్తుత తరుణంలో ఓ ఎనిమిదో తరగతి విద్యార్థి సరికొత్తగా ఆలోచించి ఆటోమేటిక్‌ హ్యాండ్‌ వాష్‌ పరి కరానికి రూపకల్పన చేశాడు.  దాని పనితీరు చూసిన ప్రతి ఒక్కరూ శెభాష్‌ అంటున్నా రు. నాగర్‌కర్నూల్‌ పట్టణానికి చెందిన కృష్ణమూర్తి టీస్టాల్‌ నడుపుతున్నాడు. అతని కొడుకు సాత్విక్‌ ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఎనిమిదోతరగతి చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో తరచూ చేతులు శుభ్రం చేసుకునేవారు హ్యాండ్‌ వాష్‌ను చేత్తో పట్టుకుంటున్నారు.

ఇది గమనించిన సాత్విక్‌.. హ్యాండ్‌ వాష్‌ను తాకకుండానే చేతులు శుభ్రం చేసుకునే విధానంపై దృష్టిసారించి ఓ పరికరాన్ని రూపొందించాడు. హ్యాండ్‌వాష్‌ బాటిల్‌కు మోటర్‌ అనుసంధానం చేసి, దానికి సెన్సర్‌ బిగించాడు. బాటిల్‌ దగ్గర చేతులు పెట్టగానే చేతిలో హ్యాడ్‌వాష్‌ పడుతుంది. సాత్విక్‌ గురువారం కలెక్టర్‌ శ్రీధర్‌ను కలిసి తాను రూపొందించిన హ్యాండ్‌వాష్‌ యంత్రం పనితీరును వివరించాడు. ఈ పరికరం తయారీకి రూ.900 ఖర్చయిందన్నాడు. విద్యార్థి మేథోశక్తిని కలెక్టర్‌ ప్రశంసించారు. భవిష్యత్తులో అతితక్కువ ఖర్చుతో ప్రజలకు అందుబాటులో ఉండేలా మరెన్నో ప్రయోగాలు చేసి జాతీయ స్థాయిలో జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని కలెక్టర్‌ సూచించారు.
logo