హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : అన్ని రకాల వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ల కోసం రోజుకు రూ.50 జరిమాన విధించే జీవో 714ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం పట్ల టీఆర్ఎస్కేవీ అనుబంధ ఆటోయూనియన్, డీసీఎం యూనియన్, స్కూల్ వ్యాన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం తెలంగాణభవన్‌లో ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య ఆధ్వర్యంలో వందలాది మంది ఆటో డ్రైవర్లు, డీసీఎం డ్రైవర్లు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. జీవో 714ను రద్దు చేసి వాహనదారులకు ఊరట కలిగించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మారయ్య కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యదర్శి రూప్సింగ్, టీఆర్ఎస్కేవీ ప్రధాన కార్యదర్శి నారాయణ, వరింగ్ ప్రెసిడెంట్ పాండు నాయక్, డీసీఎం యూనియన్ అధ్యక్షుడు కొరేపాక అంజన్న, స్కూల్ వ్యాన్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, హైదరాబాద్ అధ్యక్షుడు నిరంజన్, మేడ్చల్ అధ్యక్షుడు అహ్మద్భాయ్, రమేశ్, వీరేశ్, శ్రావణ్ కుమార్ గుప్తా, రామాంజనేయులు, రామకృష్ణ, సాయి నరసింహ తదితరులు పాల్గొన్నారు.