15న ఆటో బంద్
రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు న్యాయం చేసి, వారు ఆత్మహత్యలకు పాల్పడకుండా ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ ఈ నెల 15న ఒక రోజు ఆటో బంద్ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ ప్రకటించారు.
- ఆటో డ్రైవర్స్ జేఏసీ కన్వీనర్ అమానుల్లాఖాన్
హిమాయత్‌నగర్, ఫిబ్రవరి 3: రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు న్యాయం చేసి, వారు ఆత్మహత్యలకు పాల్పడకుండా ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ ఈ నెల 15న ఒక రోజు ఆటో బంద్ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ ప్రకటించారు. శనివారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లకు ఉపాధి లభించకపోవడంతో మనోధైర్యం కోల్పోయి ఆటోలను తగల బెట్టడంతోపాటు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.
ఉచిత బస్సు ప్రయాణానికి బదులు సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయంతోపాటు పెరిగిన ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ చార్జీలు పెంచాలని విజ్ఞప్తిచేశారు. 15న ఇందిరా పార్కు నుంచి అసెంబ్లీ వరకు జరిగే ర్యాలీకి అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జేఏసీ నాయకులు మహ్మద్ అజీముద్దీన్, మహ్మద్ దస్తగీర్, ఎస్కే మాము, అమర్ సుల్తాన్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

