మల్కాజిగిరి, జనవరి 23 : ఫైనాన్సర్ వేధింపులతో ఓ ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ రాహుల్‌దేవ్ తెలిపిన వివరాలు.. యాదమ్మనగర్కు చెందిన కురుమయ్యకు(55) భార్య ఎల్లమ్మతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఏడాది కిందట అతను ఫైనాన్సర్ వద్ద ఆటో కొనుగోలు చేశాడు. నెలవారి కిస్తీలు కట్టకపోవడంతో నెల క్రితం ఫైనాన్సర్ ఆటోను తీసుకెళ్లాడు. ఈ క్రమంలో డబ్బులు కట్టాలని ఫైనాన్సర్ వేధింపులు ఎక్కువకావడంతో గురువారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ దవాఖానకు తరలించినట్టు ఇన్స్పెక్టర్ తెలిపారు.