బచ్చన్నపేట, సెప్టెంబర్ 15 : అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం వీఎస్సార్నగర్లో చోటుచేసుకున్నది. కుటుంబసభ్యులు, ఎస్సై హమీద్ కథనం మేరకు.. వీఎస్సార్నగర్కు చెందిన చింతల అర్జున్ (33) ఆటో నడుపుకుంటూ భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడితో జీవనం సాగిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆటో చెడిపోవడంతో రూ. 3 లక్షలు, అత్తమామల తరపున మరో రూ. 3 లక్షలు, మొత్తం రూ. 6 లక్షల అప్పుచేశాడు.
ఆటో సరిగా నడవక, అప్పుతీర్చే మార్గం కనిపించక, కుటుంబ పోషణ భారం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం తెల్లవారుజామున ఆటో తీసుకొని తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య అనూష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.