దుండిగల్, ఫిబ్రవరి 4: ఆటో చోరీ విషయంలో పోలీసులు స్టేషన్‌కు పిలవడంతో మనస్తాపానికి గురైన ఓ ఆటోడ్రై ర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ మ ల్కాజిగిరి జిల్లా దుండిగల్ పోలీసులు, మృతుడి భార్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దుండిగల్ మున్సిపాలిటీలోని మహేశ్వరం గురుకుల పాఠశాల సమీపం లో దండుగుల కవిత, మహేశ్(28)దంపతులు నివాసముంటున్నారు. కవిత హౌ స్కీపర్గా, మహేశ్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. సోమవా రం ఉదయం బయటికి వెళ్లిన మహేశ్ మధ్యాహ్నం భార్యకు ఫోన్ చేసి తాను చనిపోతున్నట్టు చెప్పాడు. మంగళవారం మధ్యాహ్నం బౌరంపేట్లోని డీఆర్కే కళాశాల సమీపం లో ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాగా, కుటుంబకలహాలతో నే మహేశ్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు పేర్కొన్నారు. కాగా, ఆటో చోరీ కేసులో మహేశ్‌తోపాటు అతని స్నే హితుడిని విచారణకు రావాలని 2న సం గారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పోలీసులు పిలిచారని, మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని భార్య కవిత ఫిర్యాదులో పేర్కొన్నది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ వైద్యశాలకు తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.