హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆగస్టు 7న ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. నేతన్నలు అధికంగా ఉండే ప్రాంతాల్లో చేనేత వారోత్సవాలు నిర్వహించాలని సూచించారు. శిల్పారామాల్లో చేనేత ఉత్పత్తుల మ్యూజియాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. నేతన్నల సం క్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అమలు, ఫలితాలు, అవసరమైన మా ర్పుచేర్పులను సూచించేందుకు ఇండియన్ స్కూ ల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) వంటి సంస్థలతో అధ్యయనం చేయించాలని వెల్లడించారు. మంగళవా రం ఐఎస్బీలో చేనేత జౌళి శాఖపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేనేత వారోత్సవాల్లో వివిధ కార్యక్రమాలు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని టెక్స్టైల్స్ శాఖ అధికారులను ఆదేశించారు. నేతన్నకు చేయూత, నేతన్నకు బీమా కార్యక్రమాన్ని మరింతగా విస్తృతం చేయాలని, చేనేత మిత్ర పథకాన్ని మరింత సరళీకరించేందుకు ఉన్న వివిధ అంశాలను పరిశీలించాలని సూచించారు. వారోత్సవాల్లో నేతన్నలు, చేనేత ఉత్పత్తులపై ఆసక్తి చూపే సంస్థలు, వ్యక్తు లు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని తెలిపారు.
నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నేతన్నకు చేయూత, నేతన్నకు బీమా పురోగతిపై ఆరా తీశారు. రాష్ట్రంలో ఉన్న హ్యాండ్లూమ్ సొసైటీల పనితీరు, సభ్యులుగా ఉన్న నేతన్నల స్థితిగతులను మరింతగా మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సి న చర్యలపై చర్చించారు. నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధుల సమీకరణ కోసం అందుబాటులో ఉన్న వి విధ అంశాలపైనా మాట్లాడారు. అటు.. హైదరాబాద్ శిల్పారామాల్లో టెక్స్టైల్శాఖ తరపున మ్యూజియాలను పెట్టాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. ఆర్టీసీ, దక్షిణ మధ్య రైల్వేను సంప్రదించి హ్యాండ్లూమ్ ఉత్పత్తుల మారెటింగ్కు సహకారాన్ని తీసుకోవాలని సూచించారు.