హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని అకౌంటెంట్ జనరల్ ఆఫీసు కాంప్లెక్స్‌లో ఈ నెల 20 నుంచి 24 వరకు ఆడిట్ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆ శాఖ పరిపాలనా విభాగం డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ రాజశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వారోత్సవాలను 20న గవర్నర్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. 21న జరిగే ప్యానల్ డిసషన్లో జీఎస్టీ, కస్టమ్స్ చీఫ్ కమిషనర్ సందీప్ప్రకాశ్, తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర నింజే, పారదర్శక పాలన ప్రచారకర్త, ఫ్యాకల్టీ ఫౌండర్ డీ రాకేశ్, ఇన్వెస్టిగేషన్ విభాగం డీజీఐటీ సంజయ్ బహదూర్ పాల్గొంటారని వివరించారు. ఈ సందర్భంగా మిల్లెట్, హ్యాండ్లూమ్, ఆయిల్ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు.