ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ లక్కేరావు హఠాన్మరణం
ఐటీడీఏ గిరిజన సలహా మండలి చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనక లక్కేరావు మంగళవారం గుండెపోటుతో మరణించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ దవాఖానకు తరలిస్తుండగా కన్నుమూశారు.
ఉట్నూర్, ఆగస్టు 1: ఐటీడీఏ గిరిజన సలహా మండలి చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనక లక్కేరావు మంగళవారం గుండెపోటుతో మరణించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ దవాఖానకు తరలిస్తుండగా కన్నుమూశారు. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం వది లి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన లక్కేరావుకు.. తెలంగాణ ప్రభుత్వం ఐటీడీఏ గిరిజన సలహా మండలి చైర్మన్ పదవిని అప్పగించింది. 2016 నుంచి ఇప్పటివరకు ఐటీడీఏ ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్గా కొనసాగుతున్నారు.
ఇటీవల గుండె సంబంధిత సమస్యతో ఇంటికే పరిమితమయ్యారు. ఆయన అకాల మరణం గిరిజనులకు తీరని లోటని సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఇంద్రవెల్లి మండలంలోని తుమ్మగూడలో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆదిలాబాద్, బోథ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, ఆత్రం సక్కు, మాజీ ఎంపీ నగేశ్, ఐటీడీఏ పీవో చాహత్ బాజ్పాయి, ఆదిలాబాద్, నిర్మల్ కలెక్టర్లు రాహుల్రాజ్, వరుణ్రెడ్డి తదితరులు నివాళులర్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

