అర్వపల్లి : సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు.
సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం జాజిరెడ్డిగూడెం గ్రామంలో మంగళవారం పలువురు ఇతర పార్టీలకు చెందిన నాయకులకు టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలంగాణలో ప్రతిపక్షాలకు చోటు లేదన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్, సర్పంచ్ కుంభం ఉషారాణి, నాయకులు మొరిశెట్టి ఉపేందర్, సోమిరెడ్డి, హరిప్రసాద్, నాగరాజు పాల్గొన్నారు.