హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనమండలి, శాసనసభ సమావేశాలు ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ జారీ చేసిన గెజిట్ ఆధారంగా అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు నోటిఫికేషన్ విడుదల చేశారు.
బుర్రా వీఆర్ఎస్కు ఆమోదం ;నేడు టీజీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు
హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తేతెలంగాణ): సీనియర్ ఐఏఎస్ బుర్రా వెంకటేశం స్వచ్ఛంద పదవీ విరమణకు ఆమోదం తెలుపుతూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు. విద్యాశాఖ స్పెషల్ సీఎస్‌గా పనిచేస్తున్న ఆయన్ని టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియమించిన విషయం తెలిసిందే.