తాండూరు, మే 15: వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని ఓ గ్రామంలో దారుణం చోటుచేసుకొన్నది. 14 ఏండ్ల బాలికపై అదే కాలనీలో నివసించే యువకు డు లైంగికదాడికి పాల్పడ్డాడు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు యాలాల పోలీసులు తెలిపారు. తాగునీరివ్వాలని, ఫోన్ చార్జర్ కావాలంటూ ఆ బాలిక ఇంట్లోకి చొరబడిన ఫర్హాన్ (18) ఒంటరిగా ఉన్న బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులకు బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని వివరించడంతో వారు యాలాల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో నిందితుడు ఫర్హాన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరిపిన అనంతరం పోక్సో కేసును నమోదు చేశారు. బాలికను తాండూరులోని మాతా శిశు దవాఖానలో వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. ఫర్హాన్‌ను, నిందితుడి తండ్రి బషీర్‌ను యాలాల పోలీసులు విచారించారు. నిందితుడిని శుక్రవారం తాండూరు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్డులో హాజరుపరచగా జడ్జి ఆదేశాలతో పరిగి సబ్ జైలుకు పంపినట్టు యాలాల ఎస్ఐ విఠల్‌రెడ్డి తెలిపారు.