హనుమకొండ చౌరస్తా, నవంబర్ 14: ఈనెల 16 నుంచి వరంగల్ జిల్లాస్థాయి అస్మిత లీగ్ గర్ల్స్ అథ్లెటిక్స్ ఎంపికలు ఎరగట్టుగుట్టలోని కిట్స్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎంపికలు నిర్వహించనున్నట్లు వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పుల్యాల కిషన్, సెక్రెటరీ ఊర యుగంధర్‌రెడ్డి తెలిపారు. ఈ ఎంపికలలో 14,16 వయస్సు బాలికలకు సంబంధించిన అథ్లెటిక్స్ ఎంపికలు జరుగుతాయని, ఇందులో ఎంపికైన క్రీడాకారిణులకు ఖేలో ఇండియా సర్టిఫికెట్స్ అండ్ మెడల్స్ ప్రదానం చేస్తారని, నేషనల్ మీట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 16న ఉదయం 9 గంటలకు జనన ధ్రువీకరణ పత్రంతో హాజరుకావాలని, అండర్-14 వారు 21.12. 2011 నుంచి 20.12.2013 మధ్యలో జన్మించి ఉండాలని, అండర్-16 వారు 21.12. 2009 నుంచి 20.12.2011 మధ్యలో జన్మించి ఉండాలన్నారు. ఎంపికలు అండర్-14 వారికి ట్రైయాతలాన్ గ్రూప్ ఏ,బి,సి, కిడ్స్ జావెలిన్ త్రో, అండర్-16 వారికి 60, 600 మీటర్ల పరుగుపందెం, లాంగ్‌జంప్, హై జంప్, షాట్‌పుట్, జావెలిన్ త్రోలలో ఎంపికలు ఉంటాయని వారు తెలిపారు.