గూడూరు, జనవరి 30: మహబూబాబాద్ జిల్లా కోమటిపల్లితండాకు చెందిన నరసింహ కుమారుడు చరణ్ సీతానగరం ఆశ్రమ పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్నాడు. సంక్రాంతి సెలవుల తర్వాత ఈ నెల 23న నరసింహ చరణ్ ను పాఠశాల ఎదుట దింపి వెళ్లిపోయాడు.
చరణ్ సహ విద్యార్థి నరసింహకు ఫోన్ చేసి చరణ్ పాఠశాలకు ఎందుకు రాలేదని గురువారం అడిగాడు. ఆందోళనకు గురైన నరసింహ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విద్యార్థి సమాచారం తెలిపిన వారికి రూ.10వేల పారితోషికం ఇస్తామని, తెలిసిన వారు 8712656963, 8712656962, 9666574633 నంబర్‌కు ఫోన్ చేయాలని ఎస్సై సూచించారు.