హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో రాష్ట్ర అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల విచారణకు బుధవారం అర్వింద్‌కుమార్, బీఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ అయిన బీఎల్‌ఎన్‌రెడ్డిని ఈడీ అధికారులు, ఎంఏయూడీ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ సీనియర్ అయిన ఐఏఎస్ అర్వింద్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు విచారించారు. అరవింద్‌కుమార్‌ను ఐదుగురితో కూడిన ఏసీబీ విచారణ బృందం ఆరున్నర గంటలపాటు ప్రశ్నించినట్టు సమాచారం. ఇదే కేసులో మనీలాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన అభియోగాల నేపథ్యంలో బీఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు బుధవారం ఎనిమిదిన్నర గంటలపాటు విచారించారు.