హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): సినీనటుడు రాజ్‌తరుణ్, లావణ్యల కేసు మరో కొత్త మలుపు తిరిగింది. వారిద్దరూ పదేండ్లపాటు ఒకే ఇంట్లో కలిసి ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు ఆమె ఇంటి వద్ద పలు సాక్ష్యాధారాలను సేకరించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా పేర్కొంటూ చార్జిషీట్ దాఖలు చేశారు.
ఏఈ ఫైనల్కీపై అభ్యంతరాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : టీఎస్ జెన్కోలో ఏఈ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫైనల్కీపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. సరైన సమాధానాన్ని కాకుండా మరో ఆప్షన్‌ను సరైన సమాధానంగా పరిగణిలోకి తీసుకున్నారని, దీనిని సమీక్షించాలని కోరుతున్నారు. అయితే జెన్కో అధికారులు పట్టించుకోకపోవడం, ఒక మార్కు తేడాతో ఉద్యోగం కోల్పోయే ప్రమాదముండటంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొన్నది.