హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అందాల్సిన టీఎస్ జీఎల్ఐ(జనరల్ ఇన్సూరెన్స్) బకాయిలు పేరుకుపోయాయి. 17 నెలల బకాయిలు అందాల్సి ఉన్నదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. 2024 మార్చి నుంచి 2025 మార్చి వరకు గురువారం బకాయిలు చెల్లించినట్టు సమాచారం.
గతంలో 2024కు ముందు వరకు గల బకాయిలు చెల్లించగా, తాజాగా ఏడాది బకాయిలను ప్రభుత్వం చెల్లించింది. 17 నెలల బకాయిలు విడుదల చేయాల్సి ఉన్నదని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. ఈ మొత్తం కోట్లల్లో ఉంటాయని చెబుతున్నారు.