హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ఆరోగ్య మిత్రలు సమ్మె విరమించారు. శుక్రవారం వై ద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రా జనర్సింహతో జరిపిన చర్చలు సఫలమవడంతో సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. క్యాడర్ మార్పు అంగీకారంతోపాటు వేతనాన్ని రూ.15,600 నుంచి రూ.19,500కు పెంచేందుకు మంత్రి అంగీకరించారు. సమ్మెకాలం వేతనాలను చెల్లించేందుకు అంగీకరించినట్టు తెలిపారు. నేటి నుంచి విధుల్లో చేరనున్నట్టు వెల్లడించారు.