రవీంద్రభారతి, సెప్టెంబర్ 8: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడిందని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. సాయుధ పోరాట వాస్తవికతను విస్తృతంగా ప్రచారం చేసి తెలంగాణలో లౌకిక ప్రజాస్వామ్యం వైపు నడిపించాలన్నారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జిల్లా సమితి ఆధ్వర్యంలో ముద్రించిన తెలంగాణ పోరాట చరిత్ర బుక్‌లెట్‌ను సురవరం విడుదల చేశారు. అంతకుముందు తెలంగాణ సాయుధ పోరాట సేనాని పద్మవిభూషణ్, మాజీ ఎంపీ రావి నారాయణరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఛాయాదేవి, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి, ఈటీ నర్సింహ, కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.
పీజీ కోర్సుల్లో 72% మహిళలే
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఉన్నత విద్యలో మహిళల హవా కొనసాగుతున్నది. ప్రత్యేకించి పీజీ కోర్సుల్లో పూర్తిగా మ హిళల ఆధిపత్యమే కనబడుతున్నది. పీజీ ఫస్టియర్‌లో ఏకంగా 72% సీట్ల ను మహిళలే కైవసం చేసుకున్నారు. పురుషులు కేవలం 27% సీట్లు సొంతం చేసుకున్నారు. వరుసగా మూడోసారి పీజీ కోర్సుల్లో మహిళల ఆధిపత్యమే పునరావృతమైంది. సీపీగెట్ మొదటి విడత సీట్లను ఆదివారం కేటాయించారు. ఈ ఏడాది రికార్డుస్థాయి అడ్మిషన్లు నమోదయ్యాయి. నిరుటితో పొల్చితే 1,152 సీట్లు అధికంగా నిండాయి. పీజీ కోర్సుల్లో 50వేల వరకు సీట్లుండగా, 21,505 మంది మొదటి విడతలో సీట్లు దక్కించుకున్నారు. 13లోగా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సీపీగెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు.