హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు. 18 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలను తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. టీచర్ల బదిలీలు, పదోన్నతులపై అప్పీళ్లను స్వీకరిస్తున్నామని చెప్పారు. శుక్రవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లో ఆయన మీడి యాతో ముచ్చటించారు. ఆ తర్వాత అధికారులతో వర్చువల్‌గా సమావేశాన్ని నిర్వహించి పలు కీలక ఆదేశాలిచ్చా రు.
డీఎస్ఈ ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్‌ను ఉదయం 10:30 లోపు నమోదుచేయాలని, దీనినే మధ్యాహ్నభోజనానికి పరిగణలోనికి తీసుకుంటామని తెలిపారు. బడిబాట ఎన్‌రోల్‌మెంట్‌ను ఐఎస్ఎంఎస్ పోర్టల్‌లో అప్డేట్ చేయాలని, రెండో జత యూనిఫారాలను వెంటనే కుట్టించాలని పేర్కొన్నారు. మధ్యాహ్నభోజన పథకం వివరాలను రోజూ ఆన్లైన్లో నమోదుచేయాలని ఆదేశించారు.