హైదరాబాద్, ఫిబ్రవరి 4 : రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల వివరాలు తెలిపే ఆర్కైవ్స్ అడ్వెంచర్స్ (https: //www.aarkaysadventures.com) వెబ్‌సైట్‌ను శుక్రవారం తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వెబ్సైట్, ఇదే పేరుతో ఉన్న యూట్యూబ్ చానెల్లో తెలంగాణ పర్యాటకాన్ని ప్రమోట్ చేస్తున్నారని చెప్పారు. పర్యాటక ప్రాంతం ఎంత దూరం ఉంది? చేరుకోవడం ఎలా? రాష్ట్రంలో ప్రధా న ప్రదేశాలు, వాటి చరిత్ర అంశాలు తెలుసుకోడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు.