హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎప్‌సెట్ -26 దరఖాస్తుల స్వీకరణ గడువు సమీపిస్తున్నది. ఏప్రిల్ 4తో గడువు ముగియనున్నది. సోమవారం వరకు 2,60,427 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఇంజినీరింగ్ విభాగానికి 1,84,027, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి 76,162, రెండు పేపర్లు రాసేందుకు 238 చొప్పున దరఖాస్తులొచ్చినట్టు ఎప్‌సెట్ కన్వీనర్ విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 4 తర్వాత ఆలస్య రుసుము తో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. 250ఫైన్‌తో ఏప్రిల్ 10, రూ. 500 ఫైన్‌తో 15, రూ. 2,500 ఫైన్ తో 20, రూ.5వేల ఫైన్‌తో 24, రూ. 10వేల ఫైన్‌తో మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.