హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఒకటో ఆర్థిక సంఘం (ఫైనాన్స్ కమిషన్) నివేదికను ప్రభుత్వం ఆమోదించింది. ఫైనాన్స్ కమిషన్ ప్రభుత్వానికి చేసిన 37 సిఫార్సుల్లో 8 ఆర్థికపరమైన అంశాలు కాగా, మిగతా 29 ఆర్థికేతరమైనవిగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసింది. అయితే, పన్నుల ఆదాయం నుంచి స్థానిక సంస్థలకు 95 శాతం బదిలీ చేయాలనే అంశాన్ని క్యాబినెట్ తిరస్కరించింది. మరికొన్ని ఇతర అంశాలను ఆమోదించారు.