హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): ఆలయాల్లో భక్తులకు అసౌకర్యం కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయం లో రెవెన్యూ, దేవాదాయ, పర్యాటక, సాంసృతిక, రవాణా, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, తదితర శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుషరాలకు 69 ప్రాంతాల్లో 74 పుషర ఘాట్లను సిద్ధం చేసి, రహదారుల విస్తరణ, మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.