హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) -25 నోటిఫికేషన్ విడుదలైంది. 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. అక్టోబర్ 15 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించగా, క్లాట్ పరీక్షను ఆఫ్‌లైన్‌లో డిసెంబర్ 1న నిర్వహిస్తారు. ఈ ఏడాది క్లాట్ పరీక్షను జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం బెంగళూరు నిర్వహిస్తుంది. వివరాలకు www.consartiumofnlus. ac. in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
‘బదిలీ అయిన టీచర్లను రిలీవ్ చేయండి’
హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): బదిలీ అయిన టీచర్లను రిలీవ్చేయాలని తెలంగాణ స్టేట్ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పవన్‌కుమార్ కోరారు. రిలీవ్ తర్వాత ఖాళీలుంటే విద్యావలంటీర్లతో భర్తీచేయాలని సూచించారు. 25,036 మంది ఎస్జీటీలు బదిలీ కాగా, 40శాతం వరకు టీచర్లను రిలీవ్చేయలేదని, వారంతా మనోవేదనకు గురవుతున్నారని వాపోయారు.