హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశానికి జూలై 12 వరకు www.fcrits.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నట్టు అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్సీఆర్ఐ) తెలిపింది. జీవశాస్త్రం విభాగంలో 75 సీట్లు, గణితం విభాగంలో 25 సీట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. ఆలస్యరుసుముతో జూలై 15లోపు దరఖాస్తుకు అవకాశం ఉన్నదని వివరించింది. వివరాలకు 8074350866, 8919477851 సంప్రదించాలని సూచించింది.