హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : జీవో-317 బాధిత టీచర్లకు తాత్కాలిక బదిలీలు, డిప్యూటేషన్ల కోసం పాఠశాల విద్యాశాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. అర్హులైన ఆశావాహు లు ఈ నెల 17 నుంచి 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రకటనలో తెలిపారు. schooledu. telangana.gov.in వెబ్సైట్ను సం ప్రదించాలని సూచించారు. జీవో-25 ఆధారంగా విద్యార్థుల సంఖ్యను బట్టే తాత్కాలిక బదిలీలు, డిప్యూటేషన్లకు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.
స్పోర్ట్స్ కోటా టీచర్ల భర్తీపై ఎన్హెచ్చార్సీకి ఫిర్యాదు
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : స్పోర్ట్స్ కోటా టీచర్ల నియామకాలపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతున్నది. లోకాయుక్తలో ఇదే విషయంపై విచారణ జరగగా, తాజాగా జాతీయ మానవ హక్కుల కమిషన్లోనూ ఫిర్యాదు నమోదయ్యింది. ఈ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయ ంటూ నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త నీలం రవి ముదిరాజ్ సాక్ష్యాధారాలతో సహా ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. స్పోర్ట్స్ కో టాలో అధికారులు 33 మందికి ఉద్యోగాలు కల్పించారు. దీనిపై కొందరు హైకోర్టుకు వెళ్లారు. మరోసారి అభ్యర్థుల సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో 393 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను అధికారులు వెరిఫై చేశారు. 97 మంది జాతీయ క్రీడాకారులున్నట్టు తేలింది. అధికారులు రీ వెరిఫికేషన్ ఫలితాలు ప్రకటించడంలేదు. ఉద్యోగాల్లో చేరిన వారిని తొలగించడంలేదు. దీంతో రీ వెరిఫికేషన్ ఫలితాలు విడుదల చేయాలని, అన్యాయమైన జాతీయ క్రీడాకారులకు రక్షణ కల్పించాలని నీలం రవి ముదిరాజ్ డిమాండ్ చేశారు.