హైదరాబాద్, జూన్26 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో ఇచ్చే నీట్ లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రోస్ తెలిపారు. ఎస్సీ గురుకులంలో 30 లోపు , ఎస్టీ గురుకులంలో జూలై 3 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2023లో నీట్ రాసిన వారు అర్హులని చెప్పారు. తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షలు, పట్టణాల్లో రూ.2లక్షలు మించొద్దని పేర్కొన్నారు.