హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి (సెప్టెంబర్ 5)ని పురస్కరించుకుని అందజేసే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు 2025 సంవత్సరానికి ఉన్నత టీచర్లు, అధ్యాపకులు, ఆచార్యులు దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం సూచించింది. స్కూల్ టీచర్లు ఈ నెల 27నుంచి జూలై 15 వరకు, ఉన్నత పాఠశాల టీచర్లు జూలై 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.
ఉన్నత విద్యలో 25, పాలిటెక్నిక్ లెక్చరర్ల కోటాలో 10 మందికి అవార్డులిస్తామని కేంద్రం తెలిపింది. స్కూల్ టీచర్ల కోటాలో 50కి పైగా అవార్డులిచ్చే అవకాశముంది.