హైదరాబాద్, జనవరి2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అందజేయనున్న సబ్సిడీ రుణాలకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు మైనార్టీ కార్పొరేషన్ అధికారులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2022-23 సంవత్సరానికిగాను ‘ఎకనమిక్ సపోర్ట్ స్కీం’ కింద అర్హులైన మైనార్టీలకు ఈ సబ్సిడీ రుణాలు అందజేస్తున్నారు.
రూ.లక్ష యూనిట్‌కు 80 శాతం, రూ.2 లక్షల యూనిట్‌కు 70 శాతం సబ్సిడీతో రుణాలను మంజూరు చేయనున్నారు. మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణంగా అందజేస్తారు. అర్హులు 5వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. 22-55 ఏండ్ల వయసు కలిగి, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్ష వార్షిక ఆదాయం మించని వారు అర్హులని వెల్లడించారు. అర్హులైన వారు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డుతో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.